సోమవారం 25 జనవరి 2021
National - Dec 26, 2020 , 14:58:46

జమ్ముకశ్మీర్‌లో తొలి మహిళా బస్సు డ్రైవర్..‌ పూజా దేవి

జమ్ముకశ్మీర్‌లో తొలి మహిళా బస్సు డ్రైవర్..‌ పూజా దేవి

జమ్ము: జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఒక మహిళ ప్రయాణికుల బస్సును నడిపారు. కథువా జిల్లాకు చెందిన పూజా దేవి ఈ ఘనత సాధించారు. గురువారం జమ్ము నుంచి కథువా మార్గంలో తొలిసారి ప్రయాణికుల బస్సును డ్రైవ్‌ చేశారు. బస్సు డ్రైవర్‌ కావాలన్నది తన కోరిక అని ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. దీని కోసం తాను ఎంతో కష్టపడినట్లు తెలిపారు. మామ రాజేంద్ర సింగ్‌ నుంచి లారీ నడపడం నేర్చుకున్నట్లు వివరించారు. పేదరికం వల్ల చదువుకొనసాగించలేకపోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు. 

ముగ్గురు పిల్లలకు తల్లి అయిన పూజా దేవి మధ్యవయసులో తన కలను నెరవేర్చుకున్నారు. కుమారుడిని వెంటపెట్టుకుని గురువారం తొలిసారి జమ్ము నుంచి కథువా వరకు ప్రయాణికుల బస్సును నడిపారు. మరోవైపు మగవారితో సమానంగా ప్రయాణికుల బస్సు డ్రైవర్‌ వృత్తిని  పూజా దేవిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తోపాటు పలువురు నేతలు, స్థానికులు, తోటి డ్రైవర్లు అభినందించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్­లోడ్ చేసు­కోండి


logo