బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 14:06:32

త‌న చిలిపి చేష్ట‌ల‌తో అంద‌రినీ న‌వ్విస్తున్న‌ది!

త‌న చిలిపి చేష్ట‌ల‌తో అంద‌రినీ న‌వ్విస్తున్న‌ది!

ప్ర‌తి బ్యాచ్‌లో ఒక కామెడీ ప‌ర్స‌న్ ఉంటారు. అంద‌రూ డీసెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ వారిలో ఒక‌రు ఏదొక తుంట‌రి ప‌ని చేసి అంద‌రినీ న‌వ్విస్తూ ఉంటాడు. ఒక్కోసారి త‌న్నులు కూడా తింటాడు. అయితే ఈ చేష్ట‌లు ఒక్క మ‌నిషిలోనే కాదు. ప్రాణమున్న ప్ర‌తి జీవిలోనూ ఉంటాయి. కావాలంటే మీరే చూడండి. 8 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో నేల‌మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నది ఒక జంతువు దీని పేరు కాపిబారా అని అంటారు.

ప్ర‌శాంతంగా ఉంటే మీర్క‌ట్‌కు మ‌న‌సొప్పిన‌ట్టు లేదు. వెన‌క‌నే వ‌చ్చి కాపిబారాను గిల్లి అక్క‌డి నుంచి పారిపోయింది. మీర్క‌ట్ చూసేందుకు అచ్చం ఎలుక‌లానే ఉంటుంది. కాపిబారాను ఆట‌ప‌ట్టించేందుకు క‌నిపించ‌కుండా వెళ్లి దాక్కున్న‌ది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. 

 


logo