థాణే: బాలీవుడ్ నటి మీరా చోప్రా నిబంధనలను అతిక్రమించి వ్యాక్సిన్ వేయించుకున్నారన్న ఆరోప ణలపై థానే మున్సిపల్ కార్పొ రేషన్ (టీఎంసీ) దర్యాప్తునకు ఆదేశించింది. ఒక ప్రైవేట్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్టు పేర్కొంటూ ఫ్రంట్లైన్ వర్కర్ క్యాటగిరీలో ఆమె టీకా వేయించుకున్నట్టు బీజేపీ ఆరోపించింది. దీనిపై 3రోజుల్లో నివేదిక అందించాలని టీఎంసీ కమిషనర్ ఆదేశించినట్టు అధికా రులు తెలిపారు. తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటా మని చెప్పారు.