సోమవారం 06 జూలై 2020
National - Jun 26, 2020 , 07:39:57

మెడికల్‌ కాలేజీలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

మెడికల్‌ కాలేజీలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ వైద్యకళాశాల దవాఖానలో పనిచేస్తున్న ఏడుగురు వైద్య విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకింది. గత రెండు మూడు రోజులుగా వైద్యవిద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు. పాజిటివ్‌లుగా తేలినవారిని అయనవరంలోని ఈఎస్‌ఐ దవాఖానకు తరలించామని చెప్పారు. స్టాన్లీ మెడికల్‌ కాలేజీలో ఇప్పటికే 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది.     

చెన్నైలోని మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వ దవాఖాన, కిల్పాక్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఒమన్‌దురార్‌ ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పలువురికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వారందరిని క్వారంటైన్‌ చేశారు. 


logo