శనివారం 30 మే 2020
National - May 02, 2020 , 07:48:42

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రానికి వ‌ర్ష సూచ‌న‌

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రానికి వ‌ర్ష సూచ‌న‌

హైద‌రాబాద్‌: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంవల్ల దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్ప‌పీడ‌నం రాగ‌ల‌ 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo