ఎండీహెచ్ మసాల సంస్థల అధినేత కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ మసాలాల కంపెనీ ఎండీహెచ్ (మహాషియన్ డీ హట్టి) యజమాని మహాషై ధరంపాల్ గులాటి (98) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్ దేవి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ధరంపాల్ గులాటీని ‘దాదాజీ’ ‘మహాషైజీ’ని అని పిలుస్తుంటారు. 1923లో పాకిస్థాన్లోని సియోల్కోట్లో జన్మించారు. ధరంపాల్ గులాటి తండ్రి సియోల్కోట్లో మసాలాల వ్యాపారం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం ఆయన ఢిల్లీలోని కరోల్భాగ్లో ఓ షాప్ను ప్రారంభించారు. అక్కడి నుంచి మహాషై ధరంపాల్ గులాటి దేశంలోనే ప్రముఖ కంపెనీగా ఎండీహెచ్ను తీర్చిదిద్దారు. ఆయన మృతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంతాపం ప్రకటించారు. ఆయనను కలిసిన సందర్భంగా ఫొటోలను ట్వీట్ చేశారు. ధరంపాల్ గులాటి తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వ్యక్తని కేజ్రీవాల్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు