సోమవారం 13 జూలై 2020
National - Jun 24, 2020 , 13:43:00

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

పట్నా: త్వరలో జరగనున్న బీహార్‌ మండలి ఎన్నికలకు భారతీయ జనతాపార్టీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ జాతీయ మీడియా సహాధ్యక్షుడు సంజయ్‌ మయూఖ్‌, సమ్రత్‌ చౌదరీలన తన అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దించింది. అయితే అసెంబ్లీలో బీజేపీకి ఇప్పటికే తగినంత  బలం ఉండటంతో వీరిద్దరి గెలుపు నామమాత్రమే కానుంది. 

సంజయ్‌ మయూఖ్‌ రెండో సారి ఎమ్మెల్సీగా పోటీచేస్తుండగా, చౌదరీ మొదటి సారిగా ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బలమైన కోరీ సామాజిక వర్గానికి చెందిన చౌదరిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. 


logo