మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 08:06:30

ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఓటెయ్యండి

ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఓటెయ్యండి

జైపూర్‌: సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ‌రాజ‌స్థాన్ స‌ర్కార్‌పై బీజేపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఈ రోజు ఓటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈనేప‌థ్యంలో త‌మ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వ్య‌‌తిరేకంగా ఓటెయ్యాల‌ని మాయావ‌తి నేతృత్వంలోని బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఆదేశించింది. ఈ మేరకు త‌న ఎమ్మెల్యేల‌కు విప్ జారీ చేసింది. అయితే ఆ ఆరుగురు ఎ‌మ్మెల్యేలు గ‌తంలోనే అధికార కాంగ్రెస్ పార్టీలో విలీన‌మ‌య్యారు. 

బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల‌న్న‌ బీజేపీ ఎమ్మెల్యే మ‌ద‌న్ దిల్వార్ పిటిష‌న్‌ను దేశ అత్యున్నత న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తూ గురువారం తీర్పు వెలువ‌రించింది. ఈ వ్య‌వ‌హారంపై రాజ‌స్థాన్ హైకోర్టు ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం నిర్ణ‌యానికే వ‌దిలేసింది. ఈనేప‌థ్యంలో ఎమ్మెల్యేల‌కు బీఎస్పీ విప్ జారీచేయ‌డం వంటివి జ‌రిగాయి. 

స‌చిన్ పైల‌ట్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు జెండా ఎగ‌రేసిన నేప‌థ్యంలో, త‌మ ఎమ్మెల్యేల‌ను దొగిలించినందుకు సీఎం గెహ్లాట్‌కు గుణ‌పాఠం చెప్పాల‌ని మాయావ‌తి గ‌త నెల‌లో ప్ర‌క‌టించారు. అయితే స‌చిన్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుని తిరిగి సొంత‌గూటికే చేరాడు.  


logo