ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 15:43:10

రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని : మాయావతి

రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని : మాయావతి

జైపూర్‌ : రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరత కారణంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి  డిమాండ్ చేశారు. అక్కడ నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, రాజకీయ తిరుగుబాట్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించేలా సిఫారసు చేయాలన్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇంతకు ముందు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు బీఎ్సపీ చీఫ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బీఎ్సపీని అశోక్ గెహ్లాట్ రెండుసార్లు మోసం చేశారని,  తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు. ఇదంతా చేసి ఇప్పుడు ఫోన్ టేపుల ద్వారా మరొక చట్టవిరుద్ధమైన చర్యకు సిద్ధమయ్యారని ఆమె  అన్నారు. కోటాలో 105 మంది చిన్నారుల మరణాలపై మాయావతి ప్రశ్నించారు. 

తల్లులకు గర్భకోశాన్ని మిగిల్చిన గెహ్లాట్‌ను సీఎం సీటునుంచి దించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు.  రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 సీట్లకు 100 సీట్లు గెలుచుకోగా..  మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్ నుంచి ఒకరు గెలుపొందారు. అధికారం దక్కిన్చుకున్నా.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉండడంతో  బీఎస్పీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్, గెహ్లాట్ తీరుపై  మాయావతి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo