సోమవారం 26 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 11:40:40

యోగిని గోర‌ఖ్‌పూర్ మ‌ఠానికి పంపించండి : మాయావ‌తి

యోగిని గోర‌ఖ్‌పూర్ మ‌ఠానికి పంపించండి : మాయావ‌తి

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌క‌పోతే త‌క్ష‌ణ సీఎం ప‌ద‌వికి యోగి రాజీనామా చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. యోగి స్వ‌స్థ‌ల‌మైన గోర‌ఖ్‌పూర్ మ‌ఠానికి అత‌న్ని పంపించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాన‌ని మాయావ‌తి తెలిపారు. ఒక వేళ అక్క‌డ కూడా ఉండ‌డం న‌చ్చ‌క‌పోతే.. రామాల‌యం నిర్మాణ ప‌నుల టాస్క్ అప్ప‌గించండి అని బీఎస్పీ చీఫ్ సూచించారు.  

యూపీలో ప్ర‌తి రోజు మ‌హిళ‌ల‌పై నేరాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌న్నారు. మ‌హిళ‌ల‌పై దాడులు జ‌ర‌గ‌ని రోజంటూ లేద‌ని ఆమె పేర్కొన్నారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపు త‌ప్పాయ‌ని చెప్పారు. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు, మాఫియాకు రెచ్చిపోతుంద‌ని మాయావ‌తి తెలిపారు. 


logo