సోమవారం 25 జనవరి 2021
National - Dec 18, 2020 , 18:44:02

మా అభివృద్ధిని చెప్పుకుని గొప్పలు పోతున్నారు: మాయావతి

మా అభివృద్ధిని చెప్పుకుని గొప్పలు పోతున్నారు: మాయావతి

లక్నో: తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధిని తమవిగా చెప్పుకుని ఎస్పీ, బీజేపీ గొప్పలు పోతున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. గంగా ఎక్స్‌ప్రెస్‌ వే, జెవర్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి నమూనాలు తమ ప్రభుత్వంలో రూపుదిద్దుకున్నాయని తెలిపారు. వీటిని తాము చేసినట్లుగా బీజేపీ, ఎస్పీ చెప్పుకుని పేరు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్య నాథ్‌ రాజకీయాలపై మాయావతి మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎస్పీ ప్రభుత్వం కొనసాగించగా ప్రస్తుతం పూర్తయ్యాయని అన్నారు. అయితే వీటిని తమ అభివృద్ధిగా  ఆదిత్య నాథ్‌ చెప్పుకుని జబ్బలు చరుస్తున్నారని మాయావతి దుయ్యబట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo