శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 12:28:25

అధికార‌, ప్ర‌తిప‌క్షంపై మాయావ‌తి ధ్వ‌జం

అధికార‌, ప్ర‌తిప‌క్షంపై మాయావ‌తి ధ్వ‌జం

న్యూఢిల్లీ : రాజ్య‌స‌భలో వ్య‌వ‌సాయ బిల్లుల ఆమోదం సంద‌ర్భంగా అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షం ప్ర‌వ‌ర్తించిన తీరుపై బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి ధ్వ‌జ‌మెత్తారు. ఇరు ప‌క్షాల ప్ర‌వ‌ర్త‌న‌ను ఆమె త‌ప్పుబ‌ట్టారు. పార్ల‌మెంట్‌ను ప్ర‌జాస్వామ్య దేవాలయంగా పిలిచిన‌ప్ప‌టికీ, దాన్ని గౌర‌వాన్ని చాలాసార్లు దెబ్బ తీశార‌ని ఆమె పేర్కొన్నారు. ప్ర‌స్తుత స‌మావేశాల సంద‌ర్భంగా అధికార ప‌క్షం నేత‌లు, ప్ర‌తిప‌క్షాలు ప్ర‌వ‌ర్తించిన తీరు బాగాలేద‌న్నారు. పార్ల‌మెంట్, రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యం ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించే విధంగా ప్ర‌వ‌ర్తించ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది విచార‌క‌ర‌మ‌ని మాయావ‌తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.