శనివారం 28 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 14:30:28

బీజేపీతో పొత్తు ఉండ‌దు : మాయావ‌తి

బీజేపీతో పొత్తు ఉండ‌దు :  మాయావ‌తి

హైద‌రాబాద్‌: స‌మాజ్‌వాదీ పార్టీతో విభేదాలు త‌లెత్తిన నేప‌థ్యంలో.. అవ‌స‌ర‌మైతే బీజేపీకి ఓటు వేస్తామ‌ని ఇటీవ‌ల బీఎస్పీ నేత మాయావ‌తి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇవాళ మాయా మ‌ళ్లీ ఓ ప్ర‌క‌ట‌న చేశారు.  బీజేపీతో పొత్తు కుదుర్చుకోలేమ‌ని, వీలైతే రాజ‌కీయాల నుంచే రిటైర్ అవుతాన‌న్నారు. బీజేపీ, బీఎస్పీ మ‌ధ్య కూట‌మి ఉండ‌ద‌ని, భ‌విష్య‌త్తులో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌ద‌ని, మ‌త‌వ‌ర్గ పార్టీతో బీఎస్పీ జ‌త‌క‌ట్ట‌ద‌ని ఇవాళ ఆమె మీడియాతో వెల్ల‌డించారు.  స‌ర్వ‌జ‌న స‌ర్వ ధ‌ర్మ హితం అన్న‌ది త‌మ విధాన‌మ‌ని, ఇది బీజేపీ సిద్ధాంతానికి వ్య‌తిరేకం అని మాయావ‌తి అన్నారు. మ‌తం, కులం, పెట్టుబ‌డి సిద్ధాంతాలు క‌లిగిన పార్టీతో బీఎస్పీ జోడీ క‌ట్ట‌ద‌ని ఆమె తెలిపారు. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ పార్టీని ఓడించేందుకు అవ‌స‌రం అయితే బీజేపీకి ఓటు వేస్తామ‌ని మాయావ‌తి పేర్కొన్నారు.