ఆదివారం 05 జూలై 2020
National - Jul 01, 2020 , 12:17:35

క‌రోనా రోగుల‌ను పూడ్చిపెట్టే అంబులెన్స్‌‌.. వీడియో

క‌రోనా రోగుల‌ను పూడ్చిపెట్టే అంబులెన్స్‌‌.. వీడియో

చెన్నై: ప‌్ర‌పంచ దేశాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. దీంతో ల‌క్ష‌ల్లో కొత్త కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అయితే, క‌రోనా వ్యాపిస్తున్న తీరును చూసి జ‌నం హ‌డ‌లిపోతున్నారు. ఎవ‌రు ఏ కార‌ణంతో చ‌నిపోయినా క‌రోనా సోకిందేమోన‌నే అనుమానంతో వారి ద‌రిదాపుల‌కు కూడా వెళ్ల‌డంలేదు. ఇక క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వారి గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొన్నిచోట్ల సొంత కుటుంబస‌భ్యులు కూడా ఆఖ‌రిచూపు చూసేందుకు వెన‌కాడుతున్నారు.

చ‌నిపోయిన వారిని ముట్టుకుంటే త‌మ‌కు క‌రోనా వ‌స్తుందేమోనన్న భ‌యంతో శవాల‌ను మోసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు.  దీంతో చాలాచోట్ల‌ క‌రోనా మృతుల‌ అంతిమ సంస్కారాలు గౌర‌వ‌ప్ర‌దంగా జ‌రుగ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైకి చెందిన మౌటో ఎల‌క్ట్రిక్ మొబిలిటీ, జ‌ఫీ రోబోట్స్ కంపెనీలు సంయుక్తంగా ఒక రెస్క్యూయ‌ర్ అంబులెన్స్‌ను రూపొందించాయి. ఈ రెస్క్యూయ‌ర్ అంబులెన్స్ మాన‌వ ప్ర‌మేయం లేకుండానే క‌రోనాతో చ‌నిపోయిన‌వారి మృత‌దేహాన్ని అంబులెన్స్ నుంచి తీసుకెళ్లి బొంద‌లో జార విడుస్తుందని వారు చెబుతున్నారు. 

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల్లో క‌నీస మ‌ర్యాద‌ను పాటించ‌కుండా జేసీబీల‌తో గోతుల్లో ప‌డేస్తున్న‌ ఘ‌ట‌నల‌కు సంబంధించి తాము కొన్ని వీడియోలు చూశామ‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు హృదయవిదార‌క‌మైన‌వ‌ని మౌటో కంపెనీల సీఈవో యాస్మిన్ జ‌వ‌హ‌ర్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అందుకే తాము జ‌ఫీ రోబోట్స్ కంపెనీతో క‌లిసి రెస్క్యూయ‌ర్ అంబులెన్స్‌ను రూపొందించామ‌ని చెప్పారు. ఈ రెస్క్యూయ‌ర్ అంబులెన్స్ క‌రోనా రోగుల‌కు గౌర‌వ‌ప్ర‌దంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి తోడ్ప‌డుతుంద‌ని యాస్మిన్ తెలిపారు.  


logo