శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 25, 2020 , 17:30:42

సర్టిఫికెట్ల కోసం కోర్టుకెక్కిన వైద్య విద్యార్థులు

సర్టిఫికెట్ల కోసం కోర్టుకెక్కిన వైద్య విద్యార్థులు

న్యూ ఢిల్లీ : మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కళాశాల నుంచి పట్టభద్రులైన పది మంది వైద్య విద్యార్థులు యూఎస్‌లో రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.  న్యాయవాది సార్తక్ మాగ్గోన్ ద్వారా పిటిషన్‌ దాఖలు చేశారు. 2018లో దేశ రాజధానిలోని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కళాశాల నుంచి వైద్య విద్యలో పట్టభద్రులయ్యారు. అధికారులను సంప్రదించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ డిగ్రీ సరిఫికెట్లు అందలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించగా, సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

యూఎస్‌ఏలో రెసిడెన్సీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 15వ  తేదీ వరకు సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు ప్రక్రియ అనంతరం పత్రాల పరిశీలన, విద్యార్థుల ప్రవర్తనను సంబంధిత శాఖ కళాశాల అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్‌ 14 నాటికి ముగుస్తుందని చెప్పారు. సర్టిఫికెట్ల కోసం పిటిషనర్లు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సంబంధిత అధికారులు.. సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమైన పేపర్‌ లేదని జారీ చేయడం లేదని పేర్కొన్నారు. వెంటనే సర్టిఫికెట్లు జారీ చేసేలా ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీకి పట్టాలు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోర్టును కోరారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo