ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 14:41:46

మ‌ట్కా కింగ్‌.. ర‌త‌న్ ఖ‌త్రి కన్నుమూత

మ‌ట్కా కింగ్‌.. ర‌త‌న్ ఖ‌త్రి కన్నుమూత

హైద‌రాబాద్‌: భార‌తీయ బెట్టింగ్ దిగ్గ‌జం, మట్కా కింగ్‌గా పేరుగాంచిన ర‌త‌న్ ఖ‌త్రి చ‌నిపోయిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఆయ‌న వ‌య‌సు 88 ఏళ్లు. ముంబై సెంట్ర‌ల్‌లోని న‌వ‌జీవ‌న్ సొసైటీ ఇంట్లో ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు తెలిపారు.  సింద్ కుటుంబానికి చెందిన ర‌త‌న్ ఖ‌త్రి.. పాక్‌లోని క‌రాచీ నుంచి ముంబైకి వ‌చ్చాడు. 1947 దేశ విభ‌జ‌న స‌మ‌యంలో అత‌ను ఇండియాలోకి ఎంట‌ర్ అయ్యాడు. జూదం లాంటి మ‌ట్కా ఆట‌ను దేశవ్యాప్త చేయ‌డంలో ర‌త‌న్ ఖ‌త్రి కీల‌క పాత్ర పోషించాడు. 1962 స‌మ‌యంలో ముంబైలో మ‌ట్కా జూదానికి ఎక్కువ క్రేజీ ఉండేది. బెట్టింగ్ రాకెట్‌గా ఆ ఆట‌ను ప్రోత్స‌హించాడ‌త‌ను. ఆ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా అత‌ని నెట్వ‌ర్క్ పెరిగింది.   


logo