గురువారం 26 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 07:52:30

ఘ‌జియాబాద్ మురికివాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

ఘ‌జియాబాద్ మురికివాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘజియాబాద్‌లోని మురికివాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో సికంద‌ర్‌పూర్ తైలా మోర్ ప్రాంతంలోని మురికి వాడలో మంట‌లు పెద్దఎత్తున ఎగిసిప‌డ్డాయి. మంగ‌ళ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత (10.53 గంట‌ల ప్రాంతంలో) మొద‌లైన మంట‌లు క్ర‌మంగా స్ల‌మ్ మొత్తానికి విస్త‌రించాయి. దీంతో స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మొత్తం 15 అగ్నిమాప‌క యంత్రాల‌తో మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చామ‌ని ఘ‌జియాబాద్ ఎస్పీ నీర‌జ్ కుమార్ జ‌డౌన్ తెలిపారు. మంట‌లు ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించ‌కుండా నిలువ‌రించ‌గ‌లిగామ‌ని, ప్ర‌స్తుతానికి మంట‌లు అదుపులోనే ఉన్నాయ‌ని చెప్పారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని తెలిపారు. మురికివాడ‌లోని ప్ర‌జ‌ల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌ని వెల్ల‌డించారు.