సోమవారం 13 జూలై 2020
National - Jun 16, 2020 , 10:40:37

మార్కెట్లో మోదీ, రాహుల్‌ మాస్కులు

మార్కెట్లో మోదీ, రాహుల్‌ మాస్కులు

భోపాల్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్కుల వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. వివిధ రూపాల్లో మాస్కులను తయారు చేసి విక్రయిస్తున్నారు. అయితే భోపాల్‌కు చెందిన కునాల్‌ పరియణి అనే బట్టల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు.

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మాజీ సీఎం కమల్‌నాథ్‌ ముఖాలను పోలిన మాస్కులను తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ సందర్భంగా కునాల్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మోదీ ముఖాన్ని పోలిన మాస్కులను 500 నుంచి 1000 దాకా అమ్మినట్లు తెలిపారు. మోదీ మాస్కులకు డిమాండ్‌ బాగా పెరిగిందన్నారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాస్కులు కూడా బాగానే అమ్ముడు పోతున్నాయని తెలిపారు. రాహుల్‌, కమల్‌నాథ్‌ మాస్కులను కూడా విక్రయిస్తున్నట్లు కునాల్‌ చెప్పారు. 


logo