గురువారం 04 జూన్ 2020
National - May 19, 2020 , 00:58:56

డ్రైవర్‌, ప్రయాణికులకు మాస్క్‌ తప్పనిసరి: ఉబర్‌

డ్రైవర్‌, ప్రయాణికులకు మాస్క్‌ తప్పనిసరి: ఉబర్‌

న్యూఢిల్లీ: దేశంలో సోమవారం నుంచి ఉబెర్‌ డ్రైవర్లు, ప్రయాణికులు మాస్క్‌లు కచ్చితంగా ధరించాలని ఉబర్‌ తెలిపింది. ఇది ఇద్దరి బాధ్యత అని స్పష్టం చేసింది. మాస్క్‌ ధరించకుంటే ప్రయాణికులు లేదా డ్రైవర్లు రైడ్‌ రద్దు చేసుకోవచ్చని చెప్పింది. డ్రైవర్‌ మాస్క్‌ ధరించకుంటే తొలుత హెచ్చరిస్తామని, పదేపదే అదే తప్పు చేస్తే తమ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి తొలిగిస్తామని హెచ్చరించింది. 


logo