బుధవారం 15 జూలై 2020
National - Jul 01, 2020 , 16:08:22

ఉగ్ర‌వాదుల‌ను ప్రార్థ‌నా స్థ‌లాల్లోకి రానియ్యొద్దు: క‌శ్మీర్ ఐజీ

ఉగ్ర‌వాదుల‌ను ప్రార్థ‌నా స్థ‌లాల్లోకి రానియ్యొద్దు: క‌శ్మీర్ ఐజీ

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం సోపోర్‌లో ఈ ఉద‌యం ఉగ్ర‌‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ జ‌వాన్‌తోపాటు ఒక‌ పౌరుడు మృతిచెందాడు. మ‌రో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. తాతతోపాటు ఈ కాల్పుల్లో చిక్కుకున్న బాలుడిని సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ర‌క్షించారు. బాలుడి తాత మాత్రం ఉగ్ర‌వాదుల తూటాల‌కు బ‌ల‌య్యాడు. కాగా ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై క‌శ్మీర్ ఐజీ విజ‌య్ కుమార్ స్పందించారు. 

ఉగ్ర‌వాదులు ప్రార్థ‌నా స్థ‌లాల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని ఐజీ విజ‌య్‌కుమార్‌ చెప్పారు. ఉగ్ర‌వాదులు ప్రార్థ‌నా స్థ‌లంలో చేరి భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై కాల్పులు జ‌రుప‌టం గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇది రెండోసార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ద‌య‌చేసి ఉగ్ర‌వాదుల‌ను ప్రార్థనా స్థలాల్లోకి రానియొద్ద‌ని స్థానిక ప్రార్థ‌నా స్థ‌లాల క‌మిటీల‌కు ఐజీ విజ‌య్ కుమార్ విజ్ఞ‌ప్తి చేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo