బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 20:50:11

మేరీకోమ్‌కు ఢిల్లీ పోలీసుల సర్‌ప్రైజ్‌

మేరీకోమ్‌కు ఢిల్లీ పోలీసుల సర్‌ప్రైజ్‌

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. దీనికి పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ఉద్యోగులు, క్రీడాకారులు అనే తేడాలేకుండా అందరూ ఇళ్లలోనే టైంపాస్‌ చేస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనల్లో కొంత వెసులుబాటు ఇచ్చినా.. బర్త్‌డే పార్టీకి కావాల్సిన కేకులు, ఇతర ఐటమ్‌లు దొరక్క పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు, అధికారులు, మంత్రులు కొన్ని ప్రాంతాల్లో బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారు. సరిగ్గా ఇలాంటి  సర్‌ప్రైజే క్రీడాకారిణి, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్‌కు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు.

మేరీకోమ్‌ చిన్నకుమారుడు ప్రిన్స్‌ కోమ్‌ పుట్టినరోజు విషయం తెలుసుకొన్న స్థానిక పోలీసులు.. గురువారం ఆమె ఇంటికి వచ్చి కేకుతోపాటు చాక్లెట్లు అందజేశారు. ప్రిన్స్‌కు పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలిపిన పోలీసులకు మేరీకోమ్‌ ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. కరోనా కట్టడిలో బిజీగా ఉండే మీరు.. ఇలా మా ఇంటికి వచ్చి మా బాబుకు గ్రీటింగ్స్‌ చెప్పడం సంతోషకరంగా ఉంది అని ట్విట్టర్‌లో పేర్కొన్నది.


logo