మంగళవారం 14 జూలై 2020
National - Jun 18, 2020 , 15:26:19

అమర జవాన్లకు సచిన్‌ సంతాపం

అమర జవాన్లకు సచిన్‌ సంతాపం

ముంబై: గాల్వానా ఘటనలో అమరులైన వీర జవాన్ల మృతికి దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సంతాపం ప్రకటించారు. దేశ రక్షణ కోసం వారు చూపిన వీరోచిత పోరాట స్ఫూర్తి రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని ఆయన గురువారం ట్విట్టర్‌ ద్వారా వ్యాఖ్యానించారు. 

‘అమరులైన జవాన్లకు దేశం మొత్తం సంతాపం తెలుపుతున్నది. అలాగే, నిస్వార్థపరులైన వారి తల్లిదండ్రులకు అండగా ఉంటాం. అమరులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. రెస్ట్‌ ఇన్‌ పీస్‌..’ అని సచిన్‌ ట్వీట్‌ చేశారు. గాల్వానా లోయలో చైనా దాడిలో భారత్‌కు చెందిన కల్నల్‌ సహా 20 మంది ఆర్మీ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.logo