సోమవారం 25 మే 2020
National - Mar 30, 2020 , 13:37:29

మురుగ‌న్ ఆల‌య‌ద్వారం వ‌ద్ద పెళ్లి వేడుక‌

మురుగ‌న్ ఆల‌య‌ద్వారం వ‌ద్ద పెళ్లి వేడుక‌

హైద‌రాబాద్‌: దేశ‌మంతా లాక్‌డౌన్ విధించ‌డంతో.. అన్ని వివాహ‌వేడుక‌లు ర‌ద్దు అయ్యాయి. అయితే త‌మిళ‌నాడులో ఓ జంట మాత్రం .. కుమార‌స్వామి సాక్షిగా ఒక్క‌ట‌య్యారు.  మ‌ధురైలోని తిరుప్ప‌ర‌మ్‌కున్రం ఆల‌య ద్వారం వద్ద పెళ్లి వేడుక‌ను నిర్వ‌హించారు.  మురుగ‌న్ ఆల‌యాన్ని మూసివేయ‌డంతో..  గేటు వ‌ద్దే పెళ్లి తంతును పూర్తి చేశారు.  న‌వ దంపతులిద్ద‌రూ అక్క‌డే దండ‌లు మార్చుకున్నారు. మ‌రోవైపు త‌మిళ‌నాడులో కొత్త‌గా 17 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67కు చేరుకున్న‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.logo