సోమవారం 25 జనవరి 2021
National - Jan 03, 2021 , 16:37:57

పెళ్లి బృందం బస్సు బోల్తా.. ఏడుగురు దుర్మరణం

పెళ్లి బృందం బస్సు బోల్తా.. ఏడుగురు దుర్మరణం

కాసర్‌ఘోడ్‌ :  కేరళలోని కాసరఘోడ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పనథూర్‌ సమీపంలోని రాజాపురం వద్ద ఈ దర్ఘుటన జరిగింది. మృతులను శ్రియాస్‌ ( 11), ఆదర్శ్‌ (14), జయలక్ష్మి, సుమతి, రాజేశ్‌, రవీందచంద్రతోపాటు మరొకరిగా గుర్తించారు.

కొడగు తాలూకాలోని కరికే గ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కన్హాన్‌ఘడ్‌, పలథడిలోని దవాఖానలకు తరలించారు. ఘటనపై కేళర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనపై ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  ఏకే ససీంద్రన్ విచారణకు ఆదేశించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo