శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 16:54:16

క‌రోనా ఎఫెక్ట్‌: వీడియో కాన్ఫ‌రెన్స్‌లో వివాహం

క‌రోనా ఎఫెక్ట్‌: వీడియో కాన్ఫ‌రెన్స్‌లో వివాహం

ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ అనేక విషాదాలు, వింత‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది. క‌రోనా ర‌క్క‌సికి భ‌య‌ప‌డి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా అన్ని దేశాలు, రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌డంతో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. ర‌వాణా సౌక‌ర్యాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. సొంత వాహ‌నాల్లో సైతం ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయిన వాళ్లు ఆప‌ద‌లో ఉన్నా ఆదుకునే మార్గం లేక‌, అవ‌స‌రం ఎంత‌టిదైనా క‌లుసుకునే అవ‌కాశం లేక జ‌నం అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో ఒక‌ వింత పెండ్లి జ‌రిగింది. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో వ‌ధూవ‌రులు ఇద్ద‌రి త‌ర‌ఫు బంధువులు, మిత్రులు, చివ‌రికి వ‌ధువు వ‌రుడు కూడా ఒక్క‌చోట‌కు చేరే మార్గం లేకుండా పోయింది. దీంతో రెండు వైపుల పెద్ద‌లు మాట్లాడుకుని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పెట్టుకున్న‌ ముహూర్తానికే వివాహం జ‌రిపించాల‌ని నిశ్చ‌యించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా త‌మ నిర్ణ‌యాన్ని అమ‌లు చేశారు. మ‌త పెద్ద‌ల స‌మ‌క్షంలో వ‌ధూవ‌రులిద్ద‌రూ వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే ఒక్క‌ట‌య్యారు. కానీ ఎవ‌రి ఇండ్ల‌లో వాళ్లే ఉండిపోయారు. పాపం క‌దా! క‌రోనా వైర‌స్‌ చేసే లీల‌తో ఇంకా ఎన్ని వింత‌లు, విషాదాల‌ను చూడాల్సి వ‌స్తుందో మ‌రి.  


logo