గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 01:35:59

ఈ వేసవి హాట్‌ గురూ!

ఈ వేసవి హాట్‌ గురూ!
  • ఎండలు దంచికొడుతాయన్న ఐఎండీ

న్యూఢిల్లీ: ఈ వేసవికాలంలో మార్చి నుంచి మే నెల వరకు ఎండలు సాధారణం కన్నా ఎక్కువగా ఉండనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ప్రధానంగా వాయవ్య, పశ్చిమ, మధ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఎండల ప్రభావం అధికంగా ఉండనున్నట్లు పేర్కొంది. అలాగే ‘కోర్‌ హీట్‌ వేవ్‌ జోన్‌'లో మార్చి నుంచి మే నెల వరకు వడగాలులు సాధారణంగా ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా వీస్తాయని వెల్లడించింది. ఈ కోర్‌ హీట్‌ వేవ్‌ జోన్‌ పరిధిలో తెలంగాణ, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతం ఉన్నాయని ఐఎండీ వివరించింది.


logo