సోమవారం 06 జూలై 2020
National - Jun 03, 2020 , 14:21:45

తునికి ఆకు బస్తాలు తగులబెట్టిన మావోయిస్టులు

తునికి ఆకు బస్తాలు తగులబెట్టిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలోని సిక్కోడు ప్రాంతంలో గత రాత్రి మావోయిస్టులు తునికి ఆకు బస్తాలను తగులబెట్టి అలజడి సృష్టించారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. రాత్రి సుమారు 11 గంటల సమయంలో సాయుధ మావోయిస్టులు సురేవాడి గ్రామంలో ఓ పాఠశాల ఆవరణలో తునికి ఆకుల బస్తాలు భద్రపర్చిన చోటుకి వచ్చి నిప్పు అంటించారు. ఈ ఘటనలో 1222 బస్తాలు కాలిపోవడంతో సుమారు రూ. 5 లక్షల నష్టం జరిగినట్లు అంచనా. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నారు


logo