శనివారం 11 జూలై 2020
National - Jun 24, 2020 , 16:15:28

ఉత్త‌రాదిలో విస్త‌రించిన నైరుతి రుతుప‌వ‌నాలు

ఉత్త‌రాదిలో విస్త‌రించిన నైరుతి రుతుప‌వ‌నాలు

న్యూఢిల్లీ: నైరుతి రుతుప‌వ‌నాలు ఉత్త‌ర భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో విస్త‌రించాయి. ఇప్ప‌టికే ద‌క్షిణ భార‌త‌దేశంలోని కేర‌ళ‌, క‌ర్ణాట‌క, గోవా, తెలంగాణ, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల్లో నైరుతి రుతుప‌వ‌నాల విస్త‌ర‌ణ కార‌ణంగా భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రం అంత‌టా నైరుతి విస్తరించింది. క‌చ్ & గుజ‌రాత్ రీజియ‌న్‌తోపాటు‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాలకు ఇప్ప‌టికే విస్త‌రించిన‌ నైరుతి రుతుప‌వ‌నాలు తాజాగా మిగిలిన ప్రాంతాల‌కు చేరాయి.  

ఇక రాజ‌స్థాన్‌, చంఢీగ‌డ్, ఉత్త‌ర గుజ‌రాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి.  అదేవిధంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోలోని చాలా ప్రాంతాల‌కు కూడా నైరుతి రుతుప‌వన‌నాలు చేరాయి. జ‌మ్ముక‌శ్మీర్‌, ల‌ఢ‌ఖ్‌, గిల్గిట్ బాల్టిస్థాన్‌, ముజ‌ఫ‌రాబాద్ ప్రాంతాల‌తోపాటు ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి. భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.     


logo