సోమవారం 13 జూలై 2020
National - Jun 25, 2020 , 13:31:13

ఉత్త‌రాది రాష్ట్రాల్లో రుతుప‌వ‌నాలు

ఉత్త‌రాది రాష్ట్రాల్లో రుతుప‌వ‌నాలు

న్యూఢిల్లీ: ‌నైరుతి రుతుప‌వనాలు దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో విస్త‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే ఉత్త‌ర భార‌త‌దేశంలోని గుజ‌రాత్‌, పంజాబ్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్త‌రించిన‌ నైరుతి రుతు ప‌వ‌నాలు రాగ‌ల 24 గంట‌ల్లో మ‌రిన్ని ప్రాంతాల్లో ప్ర‌వేశించ‌నున్నాయి. ప‌శ్చిమ, తూర్పు రాజ‌స్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌నున్నాయని న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. 

ఇక హ‌ర్యానా రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాల్లో, ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని చాలా ప్రాంతాల్లో గురువారం నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని న్యూఢిల్లీ ప్రాతీయ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో రుతు ప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయ‌ని పేర్కొన్న‌ది. ఉత్త‌ర భార‌త దేశంలో నైరుతి రుతుప‌వ‌నాలు నాగ్‌పూర్‌, అల్వార్‌, ఢిల్లీ, క‌ర్నాల్‌, ఫిరోజ్‌పూర్ మీదుగా క‌దులుత‌న్నాయ‌ని వెల్ల‌డించింది. logo