ఆదివారం 24 జనవరి 2021
National - Dec 31, 2020 , 16:57:52

మ‌ద్ద‌తు ధ‌ర తొల‌గిస్తే క‌ట్ట‌ర్ రాజ‌కీయాల్లో ఉండ‌డు: హ‌ర్యానా సీఎం

మ‌ద్ద‌తు ధ‌ర తొల‌గిస్తే క‌ట్ట‌ర్ రాజ‌కీయాల్లో ఉండ‌డు: హ‌ర్యానా సీఎం

న్యూఢిల్లీ: వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు గ‌త నెల రోజుల‌కుపైగా ఆందోళ‌న చేస్తున్నారు. కొత్త చ‌ట్టాల వ‌ల్ల భ‌విష్య‌త్తులో పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర విధానాన్ని తొల‌గించే ప్ర‌మాదం ఉన్న‌ద‌న్న విష‌యంపైనే వారు ప్ర‌ధానంగా ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ద్దతు ధ‌రకు సంబంధించి హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హ‌ర్యానాలో పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర విధానాన్ని కొన‌సాగించాల‌నే నిర్ణ‌యానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మ‌నోహ‌ర్‌లాల్ క‌ట్ట‌ర్ తెలిపారు. ఒక‌వేళ ఎవ‌రైనా మ‌ద్ద‌తు ధ‌ర ప‌ద్ధ‌తిని తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తే ఆ క్ష‌ణ‌మే మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాడ‌ని ఆయ‌న శ‌ప‌థం చేశారు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo