సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 15:09:42

103 ఏళ్ల బామ్మకు ‘నారీ శక్తి పురస్కారం’ ప్రదానం..వీడియో

103 ఏళ్ల బామ్మకు ‘నారీ శక్తి పురస్కారం’ ప్రదానం..వీడియో

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు. క్రీడారంగంలో ఎన్నో విజయాలు సాధించి..ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన 103 ఏళ్ల మన్‌ కౌర్‌కు నారీ శక్తి పురస్కారాన్ని  రాష్ట్రపతి రామ్‌నాథ్‌  ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మన్‌ కౌర్‌తోపాటు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా ఫైటర్‌ పైలట్స్‌ మోహన జితర్వాల్‌, అవని చతుర్వేది, భావన కాంత్‌, బీహార్‌కు చెందిన (మశ్రూమ్‌ మహిళ) బినా దేవికి నారీ శక్తి పురస్కారాల నిఅందజేశారు. మశ్రూమ్‌ (పుట్టగొడుగుల పెంపకం) సాగుతో మశ్రూమ్‌ మహిళగా పేరుపొందారు బినాదేవి. బీహార్‌లోని ఢౌరీ పంచాయత్‌ సర్పంచ్‌గా ఐదేళ్లపాటు సేవలందించారు.
logo