బుధవారం 08 జూలై 2020
National - Jun 18, 2020 , 12:50:23

మనీష్‌కు వైద్య ఆరోగ్య మంత్రిగా అదనపు బాధ్యతలు

మనీష్‌కు వైద్య ఆరోగ్య మంత్రిగా అదనపు బాధ్యతలు

న్యూఢిల్లీ: సీఎం కేజ్రీవాల్‌ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు ఆరోగ్య శాఖ మంత్రిగా అధనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మనీష్‌కు ఆరోగ్యశాఖ బాధ్యతలు ఇచ్చారు. 

మంత్రి సత్యేంద్ర జైన్‌ తీవ్రమైన జ్వరంతో మంగళవారం ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. దీంతో ఆయనకు బుధవారం ఉదయం మరోమారు పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్‌ అని తేలింది. ఆయన కాంటాక్టులను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమయ్యింది. ఢిల్లీలో కరోనా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సత్యేంద్ర జైన్‌ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఎల్జీ అనిల్‌ బైజల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కూడా పాల్గొన్నారు. 

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ర్టాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 47,102 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 1904 మంది మరణించారు.


logo