సోమవారం 06 జూలై 2020
National - Jun 20, 2020 , 14:18:12

హోమ్ ఐసోలేష‌న్ వ‌ర్సెస్ ఇన్స్‌టిట్యూష‌నల్‌ క్వారెంటైన్‌

హోమ్ ఐసోలేష‌న్ వ‌ర్సెస్ ఇన్స్‌టిట్యూష‌నల్‌ క్వారెంటైన్‌

హైద‌రాబాద్‌: ఢిల్లీలో వైర‌స్ కేసులు అత్య‌ధిక స్థాయిలో న‌మోదు అవుతున్న విష‌యం తెలిసిందే.  అయితే అక్క‌డ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య .. కోవిడ్ స‌మ‌స్య ఎదురైంది. కోవిడ్ ల‌క్ష‌ణాలు లేని వారిని కూడా క‌చ్చితంగా అయిదు రోజుల పాటు ఇన్స్‌టిట్యూష‌న‌ల్ క్వారెంటైన‌లో ఉంచాల‌ని గ‌వ‌ర్న‌ర్ బైజాల్ తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ చేసిన సూచ‌న‌ను .. ఢిల్లీ ప్ర‌భుత్వం వ్య‌తిరేకిస్తున్న‌ది.  ల‌క్ష‌ణాలు లేని వారిని కూడా ఇన్స్‌టిట్యూష‌నల్‌ క్వారెంటైన్ చేయ‌డం వ‌ల్ల వైద్యుల‌పై భారం ప‌డుతుంద‌ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆరోపించారు.  

హోమ్ ఐసోలేష‌న్ ప‌ద్ధ‌తిని ర‌ద్దు చేసిన గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు సిసోడియా తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాలు.. ఐసీఎంఆర్ నియ‌మావ‌ళికి వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు.  ఈ ఆదేశం వ‌ల్ల ఢిల్లీలో అయోమ‌యం నెల‌కొనే ప్ర‌మాదం ఉంద‌న్నారు.  అయిదు రోజుల ఇన్స్‌టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్ త‌ర్వాత‌.. రోగుల‌ను హోమ్ క్వారెంటైన్‌కు పంపాల‌ని గ‌వ‌ర్న‌ర్ త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపైనే ఇప్పుడు ర‌భ‌స జ‌రుగుతున్న‌ది. ల‌క్ష‌ణాలు లేని వారు కూడా హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందితే, అప్పుడు సీరియ‌స్ పేషెంట్ల ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని సిసోడియా తెలిపారు.logo