శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 19:01:57

మ‌ణిపూర్‌లో మ‌రోసారి కంప్లీట్ లాక్‌డౌన్‌

మ‌ణిపూర్‌లో మ‌రోసారి కంప్లీట్ లాక్‌డౌన్‌

హైద‌రాబాద్: దేశంలో క‌‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. దాదాపు రెండు నెల‌లపాటు కంప్లీట్ లాక్‌డౌన్ విధించినా క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగాయే త‌ప్ప త‌గ్గ‌లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్రం క్ర‌మంగా క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ వ‌చ్చింది. దీంతో పాజిటివ్ కేసులు మ‌రింత ఎక్కువ‌య్యాయి. దీంతో ప‌లు రాష్ట్రాలు ఇప్పుడు మ‌రోసారి కంప్లీట్ లాక్‌డౌన్ బాట‌ప‌డుతున్నాయి. తాజాగా మ‌ణిపూర్ సైతం మ‌రో రెండు వారాలు కంప్లీట్ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు తెలిపింది. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లోకి రానుంద‌ని వెల్ల‌డించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo