ఇంఫాల్: నెస్లే సంస్థ ఉత్పత్తి అయిన కిట్ కాట్ చాక్లెట్ రేపర్‌పై తప్పుడు సమాచారం ముద్రించిన విషయాన్ని మణిపూర్ ఫారెస్ట్ అధికారి గుర్తించారు. వాస్తవాన్ని నిర్ధారించుకుని తప్పును సరిదిద్దాలని కోరుతూ ఆ సంస్థకు లేఖ రాశారు. కిట్ కాట్ చాక్లెట్ రేపర్‌పై కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ మేఘాలయలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే దానిపై రెడ్ పాండా ఫొటో ముద్రించారు.
అయితే ఈ రెండు కూడా తప్పని మణిపూర్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్‌లైఫ్) డాక్టర్ ఏకే జోషి తెలిపారు. ఆ జాతీయ పార్క్ మణిపూర్‌లోని మొయిరాంగ్ వద్ద ఉందన్నారు. అక్కడ రెడ్ పాండాలు ఉండవని చెప్పారు. ఈ తప్పును సరిదిద్దాలంటూ నెస్లే సీఎండీ సురేశ్ నారాయణన్ గురువారం లేఖ రాశారు.
నెస్లే సంస్థ బాధ్యతారహితమైన చర్యగా ఏకే జోషి అభివర్ణించారు. వాస్తవాలను ధృవీకరించకుండా రేపర్‌పై తప్పుడు సమాచారం ముద్రించిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పును సరిచేయాలని, భవిష్యత్తులో ఇలా జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆ లేఖ ద్వారా ఆ సంస్థకు సూచించారు.