ఆదివారం 05 జూలై 2020
National - Jun 28, 2020 , 20:47:42

మణిపూర్‌లో జూలై 15వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

మణిపూర్‌లో జూలై 15వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ఇంఫాల్‌ : మణిపూర్‌ రాష్ట్రంలో జూలై 15వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్‌సింగ్‌ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మరో 15రోజలపాటు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1092 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇందులో 660 యాక్టివ్‌ కేసులుండగా 432మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలాఉండగా ఇప్పటికే పలు రాష్ర్టాలు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఝార్కండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే పంతాను అనుసరించాయి. పశ్చిమబంగాల్‌ ప్రభుత్వం కొన్నింటికి సడలింపులనిస్తూ జూలై 31వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. 


logo