శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 16:15:59

సీఎంకు అప‌ఖ్యాతి కలిగేలా వ్యాఖ్య‌లు చేయొద్దు.. మ‌హిళా పోలీస్ అధికారికి కోర్టు ఆదేశం

సీఎంకు అప‌ఖ్యాతి కలిగేలా వ్యాఖ్య‌లు చేయొద్దు.. మ‌హిళా పోలీస్ అధికారికి కోర్టు ఆదేశం

ఇంఫాల్ : సీఎం బీరేన్ సింగ్ ప‌రువుకు భంగం క‌లిగించేలా, రాజ‌కీయ జీవితానికి న‌ష్టం వాటిల్లేలా ఎటువంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్య‌లు గానీ, ప్ర‌క‌ట‌న‌లు గానీ చేసి అప‌ఖ్యాతిపాలు చేయొద్ద‌ని మ‌హిళా పోలీస్ అధికారి తౌన‌జ‌మ్ బృందాను మ‌ణిపూర్ కోర్టు ఆదేశించింది. సీనియ‌ర్ డివిజ‌న్ సివిల్ జ‌డ్జీ వై. సోమోర్జిత్ సింగ్ బుధ‌వారం నాడు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ అధికారి తౌన‌జ‌మ్ బృందా, మ‌రో 10 మంది ముద్దాయిలు అదేవిధంగా ప‌లు వార్తాప‌త్రిక‌లు మౌఖికంగా, రాత‌పూర్వ‌కంగా లేదా తిరిగి ప్ర‌చురించ‌డం ద్వారా ఆరోప‌ణ‌లు చేయొద్దని ఆదేశించారు. 

త‌న‌ ప‌రువుకు భంగం క‌లిగించేలా చేస్తున్నపోలీసు అధికారి  ప్ర‌క‌ట‌న‌లు, మీడియా ఆరోప‌ణ‌లు నిలువ‌రించాల‌ని కోరుతూ సీఎం బీరేన్ సింగ్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప్ట‌టిన న్యాయ‌స్థానం స‌ద‌రు అధికారిని, మీడియా సంస్థ‌ల‌ను ఆదేశిస్తూ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ లుకోసి జూ ని పోలీస్ అధికారి తౌన‌జ‌మ్ బృందా అరెస్టు చేసి జైల్లో వేసింది. కేసులో ముఖ్య‌మంత్రి స్థాయిలో ఒత్తిళ్లు వ‌చ్చినా త‌లొగ్గి కేసులు ఎత్తేయ‌లేదు. ఏకంగా మ‌ణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌, ఆయ‌న రాజ‌కీయ అనుచ‌రులు, కేసులో డీజీపీ వ్య‌వ‌హ‌రించిన తీరు, ఎవ‌రెవ‌రూ త‌న‌పై ఏ విధంగా ఒత్తిళ్లు తీసుకువ‌చ్చింది అన్నింటినీ త‌న అఫిడ‌విట్‌లో పొందుపరిచి ఆమె కోర్టుకు స‌మ‌ర్పించారు. ఈ అఫిడ‌విట్ ఆధారంగా వార్తా ప‌త్రిక‌లు క‌థ‌న‌ల‌ను అందించాయి. 

రాష్ర్టంతో పాటు దేశ‌వ్యాప్తంగా ఈ వ్య‌వ‌హారం పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయింది. కాగా అఫిడ‌విట్‌లోని అంశాల‌ను ధృవీక‌రించ‌కుండానే వార్తాప‌త్రిక‌లు వ్యాసాల్ని ప్ర‌చురించిన‌ట్లుగా తెలుస్తుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఇది వ్య‌క్తి రాజ‌కీయ జీవితాన్ని దిగ‌జార్చ‌డంతో పాటు వ్య‌క్తిగ‌త ఖ్యాతికి ఖ‌చ్చితంగా హాని చేస్తుంద‌ని పేర్కొంది.   

తాజావార్తలు


logo