శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 07:22:05

ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు తాఖీదులిచ్చిన కాంగ్రెస్‌

ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు తాఖీదులిచ్చిన కాంగ్రెస్‌

గువాహ‌టి: రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు మ‌ణిపూర్‌ కాంగ్రెస్‌పార్టీ షోకాజ్ నోటీసు జారీచేసింది. రాష్ట్రం‌లో ఖాళీగా ఉన్న ఒకేఒక్క రాజ్య‌స‌భ‌ స్థానికి గ‌త నెల‌లో ఎన్నిక‌లు జ‌‌రిగాయి. ఇందులో వాంగ్‌ఖై ఎమ్మెల్యే ఓక్ర‌మ్ హెన్రీ, సాగోల్బండ్ ఎమ్మెల్యే ఆర్‌కే ఇమో సింగ్ పార్టీ నిబంధ‌న‌లను అతిక్ర‌మించి బీజేపీ అభ్య‌ర్థి లీషెంబా స‌నాజోబాకు ఓటువేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు పార్టీ తాఖీదులు ఇచ్చింది. 

ఓక్ర‌మ్ హెన్రీ మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత సీఎల్పీ నేత ఓక్ర‌మ్ ఇబోబీ సింగ్ మేన‌ల్లుడు కాగా, ఆర్‌కే ఇమోసింగ్ మ‌ణిపూర్ సీఎం బీరెన్ సింగ్ అల్లుడు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీకి జ‌రిగిన స‌న్మాన స‌భ‌లో కూడా పాల్గొన్నారు. 

మొత్తం 60 మంది స‌భ్యులున్న మ‌ణిపూర్ అసెంబ్లీలో, ఎనిమిది మందిపై స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేశారు. దీంతో స‌భ్యుల సంఖ్య 52కు చేరింది. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డ‌టంతో బీజేపీ అభ్య‌ర్థి గెలుపొందాడు.  


logo