బుధవారం 03 జూన్ 2020
National - Apr 24, 2020 , 13:00:49

యువ‌కుల‌కి పిచ్చెక్కించిన పోలీసులు.. ప్ర‌శంసించిన హీరో

యువ‌కుల‌కి పిచ్చెక్కించిన పోలీసులు.. ప్ర‌శంసించిన హీరో

క‌రోనా వైర‌స్‌ని అరిక‌ట్టాలంటే లాక్‌డౌన్ ఒక్క‌టే ప‌రిష్కార మార్గ‌మ‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్న‌ప్ప‌టికీ, కొంద‌రు ఆక‌తాయిలు మాత్రం ఇవేమి ప‌ట్టించుకోకుండా య‌దేచ్ఛ‌గా తిరుగుతున్నారు. ఇలాంటి వారికి త‌గిన బుద్ధి చెప్పేలా త‌మిళ‌నాడు పోలీసులు సరికొత్త ఆలోచ‌న చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ముగ్గురు యువ‌కులు ఒకే బైక్‌పై మాస్క్‌లు లేకుండా రావ‌డంతో వారికి త‌గిన బుద్ది వ‌చ్చేలా కొత్త ప్లాన్ వేశారు పోలీసులు

రోడ్ల‌పైకి రావొద్ద‌న్నా మీరు ఇలా తిరుగుతున్నారు. క‌రోనా వైరస్ రోగులతోపాటు అంబులెన్సు ఎక్కించి హాస్పిటల్‌కు తీసుకెళ్లిపోతాం. సుమారు 21 రోజులు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాతే వదిలిపెడతాం అని కుర్రాళ్ళ‌తో పోలీసులు చెప్ప‌డంతో వారు ఆగ‌మాగం చేశారు. బ‌లవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించ‌డంతో అందులో క‌రోనా పేషెంట్‌లా న‌టిస్తున్నవ్య‌క్తిని చూసి తెగ భ‌య‌ప‌డ్డారు. సైడ్ విండోస్‌ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. ఒక‌నొక స‌మ‌యంలో వారు చేసిన హ‌డావిడిని చూస్తే న‌వ్వు కూడా వ‌స్తుంది. 

త‌మిళ‌నాడు పోలీసులు చేసిన ఈ వినూత్న ప్ర‌యోగానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ప్రజల్లో అవగాహన  కోసం ఈ వీడియో విడుదల చేస్తున్నామని, అంబులెన్సులో ఉన్న వ్యక్తి నిజంగా కరోనా రోగి కాదని వెల్లడించారు. లాక్‌డౌన్ ఉల్లంఘించినవారికి గుణపాఠం చెప్పేందుకే అలా చేశామని తెలిపారు. పోలీసులు చేసిన ప‌నిని ప‌లువురు అభినందిస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కూడా త‌న ట్విట్ట‌ర్లో వీడియో షేర్ చేస్తూ.. మీ తెలివైన ఆలోచ‌న‌కి నా అభినంద‌న‌లు అని పేర్కొన్నారు


logo