శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 13:14:30

తుపాకీతో పోలీసుల్ని బెదిరించిన షారూక్ అరెస్టు

తుపాకీతో పోలీసుల్ని బెదిరించిన షారూక్ అరెస్టు

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల స‌మ‌యంలో తుపాకీతో కాల్పులు జ‌రిపిన షారుక్ అనే వ్య‌క్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.  ఈశాన్య ఢిల్లీలో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఎర్ర టీష‌ర్ట్ వేసుకున్న షారూక్‌.. చేతిలో ఉన్న తుపాకీతో కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు రిలీజ్ అయ్యాయి. అత‌ను ఆ రోజున 8 రౌండ్ల బుల్లెట్లు ఫైర్ చేశాడు. గ‌న్‌మ‌న్ షారూక్‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని షామ్లీ జిల్లాలో అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఇవాళ మ‌ధ్యాహ్నం అత‌న్ని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. పోలీసుల‌పై తుపాకీతో కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న త‌ర్వాత‌.. షారూక్ ప‌రారీలో ఉన్నాడు. క్రైం బ్రాంచ్‌కు చెందిన సుమారు ప‌ది ద‌ళాలు అత‌ని కోసం గాలించాయి.  


logo