‘హృదయ కాలేయం’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అతితక్కువ సమయంలోనే కామెడీ స్టార్‌గా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. పేరడీ సీన్స్‌తో బర్నింగ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సంపూ ఆ తర్వాత సింగం 123, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో హీరోగా నటించి సినీ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
సంపూ నటిస్తోన్న బజార్ రౌడీ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్లో సంపూ చెప్పే పంచ్ డైలాగులు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రానికి వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తుండగా.. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.