ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 12:18:31

ఆమ్లెట్‌లో పెప్ప‌ర్ ఎక్కువైంద‌ని వాక్యూమ్ క్లీనర్‌తో తీసేయాల‌నుకున్నాడు! చివ‌రికీ..

ఆమ్లెట్‌లో పెప్ప‌ర్ ఎక్కువైంద‌ని వాక్యూమ్ క్లీనర్‌తో తీసేయాల‌నుకున్నాడు! చివ‌రికీ..

కూర‌ల్లో ఉప్పు త‌క్కువైనా ప‌ర్వాలేదు. ఎక్కువైతేనే క‌ష్టం. చేసేదేంలేక అలానే తినేస్తాం. లేదంటే ప‌డేస్తాం. ఇదంతా ఉప్పు తీసేయ‌డానికి వీలుండ‌దు కాబ‌ట్టి. కానీ ఇత‌ను మాత్రం ఆమ్లెట్ మీద‌ చ‌ల్లిన పెప్ప‌ర్‌ని తీసేశాడు. దీనికి ఓ ప‌రిక‌రం కూడా ఉప‌యోగించాడు. కాక‌పోతే ఒక‌టే బాధాక‌రం. తొలిగించాల‌నుకున్న‌ పెప్ప‌ర్‌తోపాటు గుడ్డు కూడా పోయింది.

ఆర్య 2 సినిమాలో గుడ్డు మాయ‌మైన‌ట్లుగా ఇక్క‌డ కూడా గుడ్డు మాయ‌మైంది. ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు. ఇంట్లో దుమ్ము, ధూళిని పీల్చేసిన‌ట్లుగా పీల్చేస్తుందిలే అని వాక్యూమ్ క్లీన‌ర్ ఉప‌యోగించాల‌నుకున్నాడు. మొద‌ట్లో వాక్యూమ్ క్లీన‌ర్‌తో బాగానే తొల‌గిస్తున్నాడు. స‌రిగ్గా గుడ్డు మీద‌కు తీసుకురాగానే గుడ్డు మాయ‌మైంది. ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన వారంతా 'అయ్యో పాపం.. గుడ్డు మాయ‌మైందే' అని కామెంట్లు పెడుతున్నారు. 


logo