శనివారం 23 జనవరి 2021
National - Dec 02, 2020 , 11:25:57

ముంబైలో పాదచారిపై కత్తితో దాడిచేసిన దుండగుడు.. వీడియో

ముంబైలో పాదచారిపై కత్తితో దాడిచేసిన దుండగుడు.. వీడియో

ముంబై: ముంబైలో ఓ పాదచారిపై దుండగుడు కత్తితో దాడిచేశాడు. అయితే అప్రమత్తమైన అతడు ఉన్మాది నుంచి తప్పించుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడిన ఘటన గతనెల 28న జరిగింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఉన్న పాదచారుల వంతెనపై నుంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుకనుంచి ముసుగుతో వచ్చిన ఓ దుండగుడు అతనిపై కత్తితో దాడిచేశాడు. మరోమారు పొడవడానికి ప్రయత్నించేలోపు అతడు అప్రమత్తమై తప్పించుకున్నాడు. మళ్లీ దాడిచేయడానికి ప్రయత్నించినప్పటికీ బాధితుడు ప్రతిఘటించడంతో దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా ఫుటోవర్‌ బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నది. 

కాగా, దాడికి పాల్పడిన వ్యక్తి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించినట్లు లేదని పోలీసులు అన్నారు. ఇది ఆ వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడేనని, అతడిని గాయపరచడానికో లేదా చంపడానికో ప్రత్నించినట్లు ఉందని అనుమానం వ్యక్తంచేశారు.


logo