శుక్రవారం 10 జూలై 2020
National - Jun 24, 2020 , 16:54:06

సొరంగ బావిలో చిక్కుకున్న యువ‌కుడు! ఐదు గంట‌ల‌పాటు పోరాడి!

సొరంగ బావిలో చిక్కుకున్న యువ‌కుడు! ఐదు గంట‌ల‌పాటు పోరాడి!

కాసర్గోడ్‌లోని పుతిగే వ‌ద్ద‌ సొరంగ బావిలో చిక్కుకున్న యువకుడు సోమవారం కన్నుమూశారు. సొరంగం లోప‌ల ఉన్న అత‌నిని కాపేడేందుకు రెస్క్యూ సిబ్బంది ప్ర‌య‌త్నించింది. అతని వ‌ద్ద‌కు చేరుకోగానే 24 ఏండ్ల హ‌ర్షీద్ చ‌నిపోయిన‌ట్లు కుంబ్లా స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ సంతోష్ ధృవీకరించారు. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల త‌ర్వాత ఈ ప్రాంతంలో బుర‌దజ‌ల్లాలు సంభ‌వించిన‌ప్పుడు అత‌ను సురంగ అని పిలువ‌బ‌డే సొరంగ బావి వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డ చిక్కుకుపోయాడు.

హ‌ర్షీద్‌తో పాటు ఉన్న మ‌రో ఇద్ద‌రు లోతుకు వెళ్ల‌క‌పోవ‌డంతో వారిని పోలీసులు ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీశారు.  అడ్డుగా ఉన్న బుర‌ద‌ను క్లియ‌ర్ చేయ‌డానికి ప్రొక్లైన‌ర్‌ల‌ను ఉప‌యోగించారు. ఎన్ని చేసినా అర్ష‌ద్‌ను ప్రాణాల‌తో కాపాడ‌లేక‌పోయారు. జిల్లాలో తీవ్ర కరువు ఉన్నప్పుడు కాసరగోడ్‌లోని చాలా మంది రైతులు ఈ నీటి వనరులపై ఆధారపడతారు. కొండ శిఖ‌రాల నుంచి నీటిని బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి సొరంగాల‌ను ఉప‌యోగిస్తారు. 


 

 


logo