సోమవారం 01 జూన్ 2020
National - May 13, 2020 , 13:16:08

నాకు చేతులు లేక‌పోతే ఏంటీ..? వీడియో వైర‌ల్

నాకు చేతులు లేక‌పోతే ఏంటీ..? వీడియో వైర‌ల్

కాళ్లు, చేతులుండి ఆరోగ్యంగా ఉన్నా కొంత‌మంది తామేం చేయ‌లేమనుకుంటుంటారు. అలాంటి వారు ఈ వీడియో చూస్తే కొంతైనా మన‌సు మార్చుకోవ‌డం ఖాయం. ఓ వ్య‌క్తికి రెండు చేతులు లేవు. కానీ ప‌నిచేయాలన్న అత‌ని సంక‌ల్పం గ‌ట్టిది. ఆ సంకల్పం ముందు ఎంత పెద్ద ప‌నైనా సుల‌భంగా అయిపోవాల్సిందే.

స‌ద‌రు వ్య‌క్తి  ట్రాక్ట‌ర్ లో మ‌ట్టిని తీసుకె‌ళ్లేందుకు వెళ్లాడు. చేతులు లేకున్నా..త‌న కాలి వేళ్ల‌తో పారను పట్టుకుని మట్టిని తోడుకుంటూ ట్రాక్ట‌ర్ లో నింపుతున్నాడు. చేతులు లేకున్నా క‌ష్ట‌ప‌డి మ‌ట్టి నింపుతూ ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు వీడియోలో ఉన్న వ్య‌క్తి . త‌ప్పుకుంటేనే ప‌రాజ‌యం పాల‌వుతారు అనే క్యాప్ష‌న్ తో వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నంద ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo