శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 23:10:14

మైనర్‌ను అపహరించిన వ్యక్తి.. చెట్టుకు కట్టేసి దేహశుద్ధి

మైనర్‌ను అపహరించిన వ్యక్తి.. చెట్టుకు కట్టేసి దేహశుద్ధి

లూథియానా : పంజాబ్‌ రాష్ట్రం లూథియానా జిల్లా బంకార్‌ గుజరాన్‌ గ్రామంలో మైనర్‌ బాలికను అపహరించిన వ్యక్తిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి చెప్పులతో దేహశుద్ధి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న గ్రామానికి చెందిన ఓ బాలికను అతడు అపహరించాడు. ఆదివారం గ్రామస్తులకు పట్టుబడడంతో చితకబాది పోలీసులకు అప్పగించారు. అంతకుముందే అతడిపై కేసు నమోదు చేశామని స్టేషన్‌ హౌజ్‌ అధికారి తెలిపారు. శనివారం అరెస్టు చేసేందుకు వెళ్లేలోగా గ్రామస్తులు ఘోరంగా కొట్టారని పేర్కొన్నారు. నిందితుడిపై దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


logo