సోమవారం 30 మార్చి 2020
National - Mar 19, 2020 , 13:30:11

కరోనా భయం.. ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

కరోనా భయం.. ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ తనకు సోకిందనే భయంతో 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి సిడ్నీలో గతేడాది నుంచి ఉంటున్నాడు. బుధవారం రోజు సిడ్నీ నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వచ్చాడు. 

ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ కాగానే.. ప్రయాణికులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. కొద్ది మందికి కరోనా లక్షణాలు ఉండడంతో అక్కడ్నుంచి నేరుగా సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. దీంతో పంజాబ్‌కు చెందిన వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆయన రక్త నమూనాలను టెస్టుకు పంపించారు. ఇంతలోనే తనకు కరోనా సోకి ఉండొచ్చనే భయంతో ఆస్పత్రిలోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


logo