శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 16:54:24

భార్య గుర‌క‌ను ఆపేందుకు 'ట్రిక్' క‌నిపెట్టిన భ‌ర్త‌.. ఆమెకు కూడా తెలియ‌దు!

భార్య గుర‌క‌ను ఆపేందుకు 'ట్రిక్' క‌నిపెట్టిన భ‌ర్త‌.. ఆమెకు కూడా తెలియ‌దు!

ఇంట్లో ఎవ‌రైనా గుర‌క పెడితే వారికి త‌ప్ప ఇత‌రులంద‌రికీ ఇబ్బంది క‌లుగుతుంది. కానీ పాపం గుర‌క పెట్టేవాళ్ల‌ని ఏమ‌న‌లేం. నిద్ర‌లో వ‌చ్చేదానికి వాళ్ల‌యినా ఏం చేస్తారు. క‌దిలిస్తే గుర‌క ఆపుతారు కాని మ‌ర‌లా నిద్ర‌లోకి జారుకోగానే మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. అందుక‌ని ఓ భ‌ర్త త‌న భార్య గుర‌క‌ను తట్టుకోలేక ఒక ట్రిక్ క‌నిపెట్టాడు. ఈ ట్రిక్ ఆమె మీద ప్లే చేస్తున్న‌ట్లు ఆమెకు కూడా తెలియ‌దు. ఇంత‌కీ అత‌ను ఏం చేస్తాడో తెలుసా?  రాత్రులు నిద్ర‌పోయేట‌ప్పుడు భార్య గుర‌క పెట్టిన‌ట్ల‌యితే ఆమె ముఖాన్ని ఒక‌సారి నాకితే స‌రిపోతుందంటున్నాడు. దీంతో ఆమె మ‌ళ్లీ గుర‌క పెట్ట‌దు. లేదంటే భార్యను హ‌గ్ చేసుకుంటే గుర‌క ఆగిపోతుంద‌నే విష‌యాన్ని క‌నుగొన్నాడు. 

శ్రానీ బ్రైట్-పెన్నీ అనే మ‌హిళ‌కు గుర‌క‌పెట్టే అల‌వాటు ఉంది. కొన్ని నెల‌లుగా జాసన్ గ్రహమ్ ఆమె గుర‌క‌ను భ‌రిస్తున్నాడు. దీనికి పుల్‌స్టాప్ పెట్టాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేశాడు. అన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. చివ‌రి ప్ర‌య‌త్నంగా ఈ ట్రిక్ బాగా ఉప‌యోగ‌ప‌డింది. మ‌రుస‌టి ఉద‌యం శ్రానీ నిద్ర‌లేచేస‌రికి ఆమె ముఖం అంతా త‌డిగా ఉండేది. దీంతో ఆమెకు సందేహం వ‌చ్చినా ప‌ట్టించుకునేది కాదు. ఒక‌రోజు ఆమె ఫ్రెండ్ ఇంట్లో నిద్ర‌పోవాల్సి వ‌చ్చింది. అక్క‌డ కూడా శ్రానీ గుర‌క స్వ‌రూపం చూపించింది. కానీ అక్క‌డ ఆమె భ‌ర్త లేడు. ఈ గుర‌క భ‌రించ‌లేక ఆమె ఫ్రెండ్స్ జాస‌న్‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అత‌ను ఆమె ముఖం అంతా నాకేయ‌మ‌ని చెప్పాడు. చీ అలా ఎలా నాకుతారు అని వాళ్లు ఆ విష‌యాన్ని అలానే వ‌దిలేశారు. మ‌రుస‌టి ఉద‌యం శ్రానీకి అస‌లు విష‌యం తెలిసి జాస‌న్‌ను నిల‌దీసింది. దీనికి స‌మాధానంగా జాస‌న్ 'నో క‌మెంట్స్' అని బ‌దులిచ్చి త‌ప్పించుకున్నాడు.