బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 17:04:26

దోపిడీని ప్ర‌తిఘ‌టించిన‌ వ్య‌క్తిపై కాల్పులు

దోపిడీని ప్ర‌తిఘ‌టించిన‌ వ్య‌క్తిపై కాల్పులు

ఢిల్లీ : ఢిల్లీలోని ష‌హ‌దారా ఫ్లైఓవ‌ర్‌పై దోపిడీని ప్ర‌తిఘ‌టించినందుకు ఇద్ద‌రు దుండుగులు ఓ వ్య‌క్తిపై తుపాకీతో కాల్పులు జ‌రిపారు. బాధితుడిని మ‌నీష్‌గా గుర్తించారు. క‌డుపులో బుల్లెట్లు దిగ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌రలించారు. ప్ర‌స్తుతం అత‌నికి ప్రాణాపాయం త‌ప్పింది. నిందితుల ఆచూకీ కోసం ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ష‌హ‌దార్ ఫ్లైఓవ‌ర్‌పైకి చేరుకునే స‌రికి మోటార్ సైకిల్‌పై వ‌చ్చిన‌ ఇద్ద‌రు వ్య‌క్తులు వారిని అడ్డగించారు. వారి వ‌ద్ద బ్యాగును లాక్కునేందుకు ప్ర‌య‌త్నించ‌గా మ‌నీష్ ప్ర‌తిఘ‌టించాడు. దీంతో దుండ‌గుల్లో ఓ వ్య‌క్తి మ‌నీష్‌పై కాల్పులు జ‌రిపాడు. సెక్ష‌న్ 399, 397 కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. logo