e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌..!

ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌..!

ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌..!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంభాల్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ 25 ఏండ్ల యువ‌కుడు త‌న ప్రియురాలిని కాల్చిచంపి ఆ త‌ర్వాత త‌న‌ను తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సంభాల్ జిల్లాలోని చౌందౌసీ కొత్వాలీ ఏరియాలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. చౌందౌసీ కొత్వాలీ ఏరియాకు చెందిన శివ‌మ్ (25), మ‌మ‌త (23) ఒక‌రినొక‌రు ప్రేమించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో ఏం జ‌రిగిందో ఏమోగానీ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున శివ‌మ్ త‌న ప్రియురాలు మ‌మ‌త‌ ఇంటికి వెళ్లి దేశ‌వాలీ తుపాకీతో ఆమెపై కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. అనంత‌రం శివమ్ కూడా అదే తుపాకీతో త‌న‌ను తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -

మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. కాగా, శివ‌మ్ కుటుంబ‌స‌భ్యులు మాత్రం అత‌నిది ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్య చేశార‌ని ఆరోపిస్తున్నారు. మ‌మ‌త కుటుంబ‌స‌భ్యులే ఈ దారుణానికి ఒడిగ‌ట్టి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తంచేశారు. దాంతో ఇరు కుటుంబాల ఫిర్యాదుల మేర‌కు కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌..!
ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌..!
ప్రియురాలిని కాల్చిచంపి ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌..!

ట్రెండింగ్‌

Advertisement